శ్రీకాకుళం జిల్లా పలాసలో గందరగోళం నెలకొంది. పలాసలో ఉన్న సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని తొలగిస్తామని ఇటీవల మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ... నేడు తెదేపా నిరసన కార్యక్రమాన్ని తలపెట్టింది. పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంపై... డీఎస్పీ కార్యాలయం వద్ద అర్ధరాత్రి మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషతో పాటు మరికొందరు పార్టీ నాయకులు డీఎస్పీ శివరామిరెడ్డితో చర్చించారు. నిరసనకు అనుమతి ఇవ్వలేమని డీఎస్పీ చెప్పిన సందర్భంలో.. వారంతా వెనుదిరిగారు.
పలాసలో ఉద్రికత్త.. నిరసనకు తెదేపా పిలుపుతో నేతల గృహ నిర్బంధం - undefined
శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెదేపా నిరసన పిలుపుతో.. పోలీసులు అప్రమత్తమై నేతలను గృహ నిర్బంధం చేశారు.
tension prevails in palasa due to tdp calls for a protest
సొంత స్థలంలో ఉన్న విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన చేస్తామంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని వారు ప్రశ్నించారు. అనుకున్న కార్యక్రమాన్ని అనుకున్నట్టుగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో... ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పలువురిని గృహ నిర్బంధం చేశారు. నిమ్మాడలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, సోంపేటలో మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ, పలాస తెదేపా కార్యాలయంలో తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష.. గృహ నిర్బంధంలో ఉన్నారు.
Last Updated : Dec 24, 2020, 9:51 AM IST
TAGGED:
తెదేపా గృహ నిర్బంధలు