ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గస్తీ కాస్తాం... గ్రామాన్ని రక్షించుకుంటాం! - people patroling to their telukunchi village latest news

ఆ గ్రామస్థులు రోజకు రెండు షిఫ్టుల్లో వారి గ్రామానికి గస్తీ కాస్తున్నారు. కరోనా బారిన పడకుండా... ఇతరులు లోనికి ప్రవేశించకుండా రహదారులను మూసివేశారు. ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి గ్రామస్థులు ఈ పని చేసేందుకు ఇంటికి ఒకరు చొప్పున జాబ్​ కార్డులు జారీ చేసుకున్నారు.

telukunchi village people patroling in a shift manner to protect from outsiders for avoiding corona virus
గస్తీ కాస్తున్న తేలుకుంచి గ్రామస్థులు

By

Published : May 13, 2020, 11:54 AM IST

"మా గ్రామానికి ఎవరూ రాకూడదు. ఎవరైనా వస్తే అడ్డుకుంటాం" అని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి గ్రామస్తులు స్పష్టం చేస్తున్నరు. బయటి వారిని తమ ప్రాంతానికి రానివ్వకుండా.. గ్రామస్తులే 2 షిఫ్టుల్లో గస్తీ కాస్తున్నారు. ఇతరులు లోనికి ప్రవేశించకుండా గ్రామ శివార్లలో ప్రవేశాన్ని నిషేధించారు. ఇతర గ్రామాల వారు తన గ్రామంలోకి చొరబడకుండా రహదారులు ముసివేశారు.

గ్రామంలోని మూడు రహదారులను మూసివేసి... రోజుకు రెండు షిఫ్టుల్లో గస్తీ కాస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు... అలాగే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు విభజించుకొని వారి గ్రామంలోకి ఎవరూ రాకుండా చూస్తున్నారు. గస్తీ విధులకు గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒకరు హాజరయ్యే విధంగా జాబ్​ కార్డులను జారీ చేసుకున్నారు. అత్యవసరమైతే తప్ప గ్రామాన్ని దాటి ఎవరు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.

లాక్ డౌన్ అమలులో భాగంగా.. ఇలాంటి చర్యలతో ఈ గ్రామస్తులు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే ఇలాంటి జాగ్రత్తలు తప్పనిసరి అని వారు స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

'మా గ్రామంలో క్వారంటైన్‌ కేంద్రం వద్దు'

ABOUT THE AUTHOR

...view details