అతను ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు. జానపద నృత్యకారుడు. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై పాటల రూపంలో ప్రజలను చైతన్య పరుస్తున్నారు. కనబడని శత్రువుతో పోరాటం చేస్తున్నామంటూ... డాక్టర్లు, పోలీసులకు సహకరిస్తూ ఇంట్లోనే ఉండాలంటూ పాటలతో ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
అతనే శ్రీకాకుళం జిల్లా కవిటి గ్రామానికి చెందిన భగవతి కృష్ణ శర్మ. కరోనాపా ప్రజలకు అవగాహన కలిగించేలా పాటతో అతను చేసిన ప్రయత్నాన్ని మీరూ ఆలకించండి.