Financial Assistance for House construction in Telangana : తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం.. నియోజకవర్గంలో 2వేల మందికి ₹3లక్షల చొప్పున ఆర్థికసాయం చేయనున్నట్లు శాసనసభలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ సాయాన్ని 15 రోజుల్లో ప్రారంభిస్తామని ఇటీవల మహబూబ్‌నగర్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు దీనిపై శాసనసభలో నిధులు కేటాయిస్తూ అధికారిక ప్రకటన వెలువడింది.
తెలంగాణలో కొత్త పథకం..! ఇల్లు కట్టుకుంటే రూ.3 లక్షలు.. ఇది నియోజకవర్గంలో 2వేల మందికే! - AP CRIME NEWS
Telangana: తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం.. నియోజకవర్గంలో 2వేల మందికి ₹3లక్షల చొప్పున ఆర్థికసాయం చేయనున్నట్లు శాసనసభలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ సాయాన్ని 15 రోజుల్లో ప్రారంభిస్తామని ఇటీవల మహబూబ్‌నగర్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటన కూడా చేశారు.
ముఖ్యమంత్రి కోటాలో మరో 25వేల మందికి ఆర్థికసాయం చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా మొత్తం 2.63లక్షల మందికి ₹7,890 కోట్లు ఇవ్వనున్నట్లు హరీశ్ వెల్లడించారు. అలాగే బడ్జెట్‌లో రెండు పడక గదుల ఇళ్లకు ₹12వేల కోట్లు కేటాయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 67,782 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని హరీశ్ రావు తెలిపారు. 32,218 ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని వెల్లడించారు. మరోవైపు బడ్జెట్‌లో పాతబస్తీ మెట్రోకు ₹500 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైలుకు ₹15,00 కోట్లు కేటాయించారు. మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం ₹3వేలకు పెంచారు.
ఇవీ చదవండి: