సీఎం జగన్ ప్రజా సంకల్పయాత్ర చేపట్టి మూడు వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా.. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పాదయాత్ర నిర్వహించారు. నందిగాం మండలంలోని జల్లపల్లి, దేవలబద్ర, నర్సిపురం, లఖిదాసుపురం, దిమిలాడ గ్రామాల మీదుగా యాత్ర సాగింది. 'ప్రజలలో నాడు–ప్రజల కోసం నేడు' పేరిట నియోజకవర్గ ఇంఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. యాత్రలో భాగంగా.. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైకాపా శ్రేణులు, మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
టెక్కలిలో వైకాపా నేతల పాదయాత్ర - prajalalo nadu prajala kosam nedu in tekkali
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో వైకాపా నేతలు పాదయాత్ర నిర్వహించారు. సీఎం జగన్ ప్రజా సంకల్పయాత్రకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా.. నియోజకవర్గ ఇంఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వైకాపా అభిమానులు, మహిళలు భారీగా హాజరయ్యారు.

టెక్కలిలో వైకాపా పాదయాత్రలో మహిళలు