పత్రిక స్వేచ్ఛకి ఆటంకం కలిగిస్తూ విడుదల చేసిన జీవో నెంబర్ 938ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని టెక్కలి ఎమ్మెల్యే, తెదేపా నేత కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా తెదేపా కార్యాలయం వద్ద ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్, మరికొందరు తెదేపా నేతలతో కలిసి జీవో ప్రతిని అచ్చెన్నాయుడు దగ్ధం చేసారు.
'పత్రిక స్వేచ్ఛకి ఆటంకం కలిగించే జీవోను ప్రభుత్వం రద్దు చేయాలి' - tdp mla acchennaidu protest on media GO in srikakulam
రాష్ట్ర ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛకి ఆటంకం కలిగించేలా తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
'పత్రిక స్వేచ్ఛకి ఆటంకం కలిగించే జీవోను ప్రభుత్వం రద్దు చేయాలి'