ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

టెక్కలి మాజీ ఎమ్మెల్యే సత్తారు లోకనాథం కన్నుమూత - srikakulam district latest news

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మాజీ ఎమ్మెల్యే సత్తారు లోకనాథం ఆదివారం మృతి చెందారు. ఆయన భార్య చనిపోయిన నెల రోజులకే లోకనాథం మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. లోకనాథం కుటుంబసభ్యులను పలువురు రాజకీయ నేతలు పరామర్శించారు.

tekkali former mla satharu lokanatham died in srikakulam district
టెక్కలి మాజీ ఎమ్మెల్యే సత్తారు లోకనాథం కన్నుమూత

By

Published : Dec 13, 2020, 10:52 PM IST

శ్రీకాకుళం జిల్లా టెక్కలి మాజీ ఎమ్మెల్యే సత్తారు లోకనాథం ఆదివారం తుదిశ్వాస విడిచారు. 1972లో కాంగ్రెస్ పార్టీ నుంచి టెక్కలి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. అనంతరం టెక్కలి సమితికి అధ్యక్షునిగా 1984వరకు పని చేశారు. నెలరోజుల క్రితం ఆయన భార్య సత్తారు అన్నపూర్ణ కరోనాతో మృతి చెందగా... ఆదివారం లోకనాథం కూడా మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

రాజకీయాల్లో చివరి వరకు ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడారు. అభివృద్ధి ప్రణాళికలోనూ తనదైన పాత్ర పోషించారు. జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్​గా, టెక్కలి వ్యవసాయ పరపతి సంఘం అద్యక్షునిగా విశేష సేవలు అందించారు.

గోపినాథపురంలో సోమవారం సత్తారు లోకనాథం అంత్యక్రియలు జరగనున్నాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, పార్లమెంటు సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు... లోకనాథం కుటుంబ సభ్యులను ఫోన్​లో పరామర్శించారు. కేంద్ర మాజీ సహాయమంత్రి కిల్లి కృపారాణి, కళింగ కార్పొరేషన్ ఛైర్మన్ పేరాడ తిలక్, వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్ తదితరులు ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఇదీచదవండి.

21న భూముల సమగ్ర సర్వే ప్రారంభించనున్న సీఎం జగన్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details