శ్రీకాకుళం జిల్లా రాజాంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ చేపట్టారు. కార్మిక దినోత్సవం సందర్భంగా రాజాం నగర పంచాయతీలో పనిచేస్తున్న 70 మంది కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆర్థిక సహకారంతో బియ్యంతో పాటు 10 రకాల నిత్యావసర వస్తువులు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. రాజాం నగర కమిషనర్ నెల్లి రమేష్, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి మోహన్ రావు, సీఐటీయూ నాయకులు రామ్మూర్తి నాయుడు చేతుల మీదుగా కార్మికులకు నిత్యావసర వస్తువులను అందించారు.
రాజాంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ - రాజాం ఉపాధ్యాయ సంఘాల తాజా వార్తలు
రాజాంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులను ఉపాధ్యాయ యూనియన్లు అందించాయి.
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు అందిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు