శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం శ్రీహరి నాయుడుపేట గ్రామంలో తెదేపా-వైకాపా వర్గీయుల మధ్య తలెత్తిన వివాదం... కొట్లాటకు దారితీసింది. గ్రామంలో పైపులైన్ల పనుల విషయంలో ఇరుపార్టీల కార్యకర్తలు... ఒకరిపై ఒకరు దాడికి దిగారు. గొడవలో పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘర్షణతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికుల సమాచారంతో... పాలకొండ డీఎస్పీ రారాజుప్రసాద్ గ్రామానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
తెదేపా-వైకాపా వర్గాల మధ్య ఘర్షణ... గ్రామంలో ఉద్రిక్తత - శ్రీకాకుళం తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లా శ్రీహరి నాయుుడపేటలో తెదేపా-వైకాపా వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం... కొట్లాటకు దారితీసింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడిచేసున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. వైకాపా కార్యకర్తలపై తెదేపా వర్గీయులు దాడులు చేస్తున్నారని... స్థానిక ఎమ్మెల్యే జోగులు ఆరోపించారు.
tdp ycp leader at clash at srikakulam
గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. వైకాపా కార్యకర్తలు పెద్దసంఖ్యలో సంతకవిటి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేశారు. తెదేపా వర్గీయులు కూడా సంతకవిటికి రావడంతో... ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైకాపా కార్యకర్తలపై దాడులు చేయడం అన్యాయమని... స్థానిక ఎమ్మెల్యే కంబాల జోగులు ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :సంతకవిటిలో వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ