తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి బాలాజీ కలిశారు. తనకు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి తెదేపాతోనే సాధ్యమని బాలాజీ అన్నారు. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయటానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
'ఉత్తరాంధ్ర అభివృద్ధి తెదేపాతోనే సాధ్యం' - తెదేపా రాష్ట్రకార్యదర్శి బాలాజీ
ఉత్తరాంధ్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెదేపా రాష్ట్ర కార్యదర్శి బాలాజీ అన్నారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని స్పష్టం చేశారు.
అచ్చెన్నాయుడిని కలిసిన బాలాజీ