రాష్ట్రంలో గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో మాట్లాడిన ఆయన.. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేసినప్పటికీ 93 శాతం నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు. దీనిపై కళా తెదేపా నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందనడానికి ఎన్నికల వాయిదా నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఎన్నికల నేపథ్యంలో తెదేపా శ్రేణులపై జరుగుతోన్న దాడులను ప్రజలు గమనిస్తున్నారని కళా అన్నారు.
'తెదేపా శ్రేణులపై వైకాపా దాడులను ప్రజలు గమనిస్తున్నారు' - tdp state president kala venkatarao comments on election situation
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం నిర్వీర్యం అవుతోందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు విమర్శించారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో తెదేపా నేతలు, కార్యకర్తలపై జరుగుతోన్న దాడులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
'తెదేపా శ్రేణులపై వైకాపా దాడులను ప్రజలు గమనిస్తున్నారు'