ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా సీనియర్ నేత మృతి... ఫోన్​లో చంద్రబాబు పరామర్శ - srikakulam district news

శ్రీకాకుళం జిల్లాకు చెందిన తెదేపా సీనియర్ నేత బెందాళం ప్రకాశ్ మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. ప్రకాశ్ కుమారుడు, ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్​ను తెదేపా అధినేత చంద్రబాబు పరామర్శించారు.

TDP senior leader dies with illness in icchapuram srikakulam district
తెదేపా సీనియర్ నేత ప్రకాశ్

By

Published : Sep 13, 2020, 7:27 PM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి, మాజీ ఎంపీపీ, తెదేపా సీనియర్‌ నేత బెందాళం ప్రకాశ్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆదివారం తుదిశ్వాస విడిచారు. తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అశోక్​ను ఫోన్​లో పరామర్శించారు. ప్రకాశ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

ABOUT THE AUTHOR

...view details