ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా సర్కార్ చర్యలకు భయపడేది లేదు: కూన రవికుమార్ - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు

తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ పార్టీ నేత కూన రవికుమార్ విమర్శించారు. తమ పార్టీ నాయకులపై కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తోందని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు భయపడేది లేదని స్పష్టం చేశారు.

కూన రవికుమార్
కూన రవికుమార్

By

Published : Aug 28, 2020, 8:32 PM IST

వైకాపా తాటాకుచప్పుళ్లకు తెదేపా భయపడదన్నారు కూన రవికుమార్‌. శ్రీకాకుళం జిల్లా తెదేపా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెదేపాను నిర్వీర్యం చేయడానికి జగన్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ క్రమంలోనే తెదేపా నేతలపై కేసులు పెడుతోందని కూన రవి ఆరోపించారు.

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై కూడా కక్షపూరితంగానే కేసు పెట్టారన్న కూన... ఆయనకు బెయిల్‌ మంజూరు కావటంపై హర్షం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు అవినీతి చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని... ఆయన నిర్ధోషిగా బయటకు వస్తారన్నారు. వైకాపా అరాచకాలకు భయపడవద్దని తెదేపా శ్రేణులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details