అనుభవం లేక ముఖ్యమంత్రి జగన్ సంపద సృష్టించలేకపోతున్నారని తెలుగుదేశం ఎంపీ కింజారపు రామ్మోహన్‌నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పలాస తెదేపా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెదేపా హయాంలో ఉన్న సంక్షేమ పథకాలనే నవరత్నాల పేరుతో మార్చారని అన్నారు.
'తెదేపా హయాంలోని పథకాలనే నవరత్నాలుగా మార్చారు' - తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు నేటి వార్తలు
వైకాపా ప్రభుత్వ తీరుపై తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్కు అనుభవం లేక సంపద సృష్టించలేకపోతున్నారని మండిపడ్డారు.

తెలుగుదేశం ఎంపీ కింజరపు రామ్మోహన్‌నాయుడు
ప్రజా సమస్యలపై వైకాపా దృష్టి సారించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలులో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. పలాస నియోజకవర్గంలో భూ కబ్జాలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు.
ఇదీచదవండి.