ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా నిర్వాకం వల్లే విశాఖ ఉక్కు కర్మాగారానికి ఈ పరిస్థితి' - ఉక్కు పరిశ్రమ విషయంలో అన్ని పార్టీలు కలిసి పోరాడాలని పిలుపునిచ్చిన ఎంపీ రామ్మోహన్ నాయుడు

ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై.. తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని ఆరోపించారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.

mp rammohan naidu response on visakha steel privatization
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై రామ్మోహన్ నాయుడు స్పందన

By

Published : Feb 5, 2021, 8:37 PM IST

వైకాపా నిర్వాకం వల్లే విశాఖ ఉక్కు కర్మాగారానికి ఈ పరిస్థితి: రామ్మోహన్ నాయుడు

విశాఖ ఉక్కు సెగ త్వరలోనే సీఎం జగన్​కు తగులుతుందని తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు. వైకాపా నిర్వాకం వల్లే కర్మాగారం ప్రైవేటుపరం కానుందని ఆరోపించారు. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఛత్తీస్​గఢ్​ తరహాలో తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కర్మాగారం నిర్వహణ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు.

సీఎం జగన్ ఎప్పుడు దిల్లీ వెళ్లినా సొంత అజెండా మీదే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. 28మంది ఎంపీలున్నా.. కేంద్రాన్ని నిలదీసే ధైర్యం వైకాపాకు లేదని విమర్శించారు. ఈ నిర్ణయంపై రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. వాజపేయిని స్ఫూర్తిగా తీసుకుని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details