రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత దారుణాలు, దౌర్జనాలు విచ్చలవిడిగా పెరిగాయని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఆరోపించారు. మంగళవారం శ్రీకాకుళం పోలీసు కార్యాలయానికి తెదేపా నాయకులతో కలిసి వచ్చిన ఆయన.. ఎస్పీ అమిత్‌బర్దార్‌కు వినతిపత్రం ఇచ్చారు.
జిల్లాలో తెదేపా సానుభూతి పరులపై జరుగుతున్న దాడులను ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లామని మీడియాకు ఎంపీ వెల్లడించారు. పోలీసు వ్యవస్థ ప్రజలకు అండగా ఉండాలని ఎస్పీని కోరామన్నారు. వైకాపా నాయకుల ఒత్తిళ్లకు లోనై కొందరు పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఎస్పీకి వివరించామన్నారు. తమ వినతికి ఎస్పీ సానుకూలంగా స్పందించారని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.