ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలి' - ఆముదాల వలస పార్టీ సమావేశం

పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని తెదేపా శ్రీకాకుళం జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్​ఛార్జి కూన రవికుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆమదాలవలస పార్టీ కార్యాలయంలో నాయకులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు.

kuna ravi lkumar
'పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలి'

By

Published : Jan 26, 2021, 7:46 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తెదేపా కార్యాలయంలో జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్​ఛార్జి కూన రవికుమార్ పార్టీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నామినేషన్ వేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నామినేషన్ పత్రాలతో జత చేసిన పత్రాల ప్రతిని పరిశీలించాలన్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details