అమరావతి రైతులు చేస్తున్న దీక్షలకు సంఘీభావంగా శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్పేటలో తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలనేదే ప్రజల ఆకాంక్ష అన్నారు.
శ్రీకాకుళంలో రాజధాని రైతులకు మద్దతుగా తెదేపా ర్యాలీ - protest news
శ్రీకాకుళం జిల్లా ఎల్ఎల్పేటలో రాజధాని రైతులకు మద్దతుగా తెదేపా నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెదేపా నాయకుల ర్యాలీ