శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అచ్చెన్నాయుడు అరెస్ట్ వివాదాస్పదంగా మారటంతో.. ముందస్తుగా ఎలాంటి ఘటనలకు తావివ్వకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని తెదేపా ముఖ్యనేతలను గృహనిర్బంధించారు. మాజీ మంత్రి కళా వెంకట్రావును రాజాంలోని తన నివాసంలో నిర్బంధించారు. రాజాం నియోజకవర్గ ఇంఛార్జి కోండ్రు మురళీమోహన్‌కు ముందస్తు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు.
శ్రీకాకుళంలో తెదేపా నేతల గృహ నిర్బంధాలు.. - tdp leaders house arrest at srikakulam
శ్రీకాకుళం జిల్లాలోని తెదేపా ముఖ్యనేతలను పోలీసులు గృహనిర్బంధించారు. నిమ్మాడలో అచ్చెన్నాయుడు అరెస్ట్ నేపథ్యంలో.. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
![శ్రీకాకుళంలో తెదేపా నేతల గృహ నిర్బంధాలు.. tdp leaders house arrest at srikakulam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10472787-278-10472787-1612266103714.jpg)
tdp leaders house arrest at srikakulam district
చట్టాన్ని ప్రభుత్వం తన చేతుల్లో తీసుకుంటుందని కళా వెంకట్రావు అన్నారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కోడ్ ఉల్లంఘన చేస్తూ అరెస్టుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: నిమ్మాడలో అచ్చెన్నాయుడు అరెస్టు.. రెండు వారాల రిమాండ్