వాలంటీర్లు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని కూన రవి కుమార్ పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వైకాపా నాయకులు చెప్పారని.. ఫిర్యాదుదారుడు పోలీసుస్టేషన్‌కు రాకముందే పోలీసులు బాధితులపై విరుచుకుపడుతున్నారని కూన ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు వచ్చిన బాధితుడిపై సీఐ వేణుగోపాల్ ప్రవర్తించిన తీరు దారణమన్నారు. కాశీబుగ్గ ఘటనకు సంబంధించి గ్రామ సచివాలయ సిబ్బందితోపాటు వాలంటీర్ పైనా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని కూన రవికుమార్ పేర్కొన్నారు.
'జగన్ సృష్టించిన వాలంటీర్ల వ్యవస్థ అరాచకంగా తయారైంది' - గ్రామ వాలంటీర్లపై కూన రవికుమార్ కామెంట్స్
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయని తెదేపా నేత కూన రవికుమార్ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి సృష్టించిన వాలంటీర్ల వ్యవస్థ అరాచకంగా తయారైందని ఆరోపించారు.
!['జగన్ సృష్టించిన వాలంటీర్ల వ్యవస్థ అరాచకంగా తయారైంది' tdp leader kuna ravikumar comments about volunteers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8316611-343-8316611-1596706918200.jpg)
tdp leader kuna ravikumar commenttdp leader kuna ravikumar comments about volunteerss about volunteers