తాడేపల్లి నుంచి వచ్చిన నోట్‌లో సంతకం చేసేందుకేనా నీలం సాహ్నిని ఎస్‌ఈసీగా నియమించిందని.. తెదేపా నేత కూన రవికుమార్ ప్రశ్నించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్ణయాన్ని ముందుగా మీడియా సమావేశంలో మంత్రులు ప్రకటించండం ఏంటన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్... వైకాపా ప్రభుత్వంతో కలిసి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందన్న కూన రవికుమార్.. ఈ క్రమంలోనే తెదేపా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తుందని స్పష్టం చేశారు.
అందుకే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు బహిష్కరిస్తున్నాం: కూన రవికుమార్ - తెదేపా నేత కూన రవికుమార్ న్యూస్ లేటెస్ట్
ఎన్నికల నిర్ణయాన్ని ముందుగా మంత్రులు తేదీలతో సహా చెప్పడమేంటని తెదేపా నేత కూన రవికుమార్ ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వైకాపా ప్రభుత్వంతో కలిసి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని వ్యాఖ్యానించారు.
![అందుకే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు బహిష్కరిస్తున్నాం: కూన రవికుమార్ tdp leader](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11259176-530-11259176-1617413698244.jpg)
tdp leader
TAGGED:
ఏపీ న్యూస్ అప్డేట్స్