arrest: అర్ధరాత్రి... తెదేపా నేత కూన రవికుమార్ అరెస్టు - శ్రీకాకుళం జిల్లా తాజా సమాచారం
02:33 November 21
బంధువుల ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రవికుమార్ అరెస్టు
శ్రీకాకుళం జిల్లా(srikakulam district)లో తెదేపా నేత కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్టు (TDP leader Koona Ravikumar arrested) చేశారు. పోలీసుల పట్ల దుర్భాషలాడారని శనివారం అర్ధరాత్రి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని శాంతినగర్ కాలనీలోని ఆయన అన్నయ్య ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఎచ్చెర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.
పోలీసులు తీరును కూన రవికూమార్ అన్నయ్య కూన వెంకట సత్యనారయణ ఖండించారు. అర్ధరాత్రి ఇంటికి వచ్చి గది తలుపులు, గెడలను తొలగించి ... తన తమ్ముడి తీసుకెళ్లారని ఆరోపించారు.
ఇదీ చదవండి