ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Kala Venkatrao on YCP: 'వైకాపా పాలనలో ధరలు పెరిగాయి' - srikakulam district updates

వైకాపా పరిపాలనపై తెదేపా నేత కళావెంకట్రావు విమర్శలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక నిత్యవసరాలు మొదలు అన్ని వస్తువుల ధరలు పెరిగాయన్నారు. కేరళ ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గించినదన్న కళా.. మన రాష్ట్రంలో సీఎం జగన్ ఎంత తగ్గిస్తారని ప్రశ్నించారు.

Kalavenkatrao
కళావెంకట్రావు

By

Published : Jul 5, 2021, 8:18 PM IST

వైకాపా ప్రభుత్వం కరోనా కట్టడిలో ఘోర వైఫల్యం చెందిందని తెదేపా నేత కిమిడి కళావెంకట్రావు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో మీడియాతో మాట్లాడిన కళా.. వైకాపా ప్రభుత్వంలో అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని విమర్శించారు.

మరోవైపు... జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను వైకాపా ప్రభుత్వం మోసం చేసిందని కళా ఆరోపించారు. కేరళ ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గించిన విషయాన్ని ప్రస్తావించిన కళా వెంకట్రావు.. మన రాష్ట్రంలో సీఎం జగన్ ఎంత తగ్గిస్తారని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details