రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం చేతకాకపోతే.. ప్రతి పట్టభద్రుడికి నిరుద్యోగ భృతి చెల్లించాలని మాజీ మంత్రి కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులు తమ గోడు చెప్పుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తే వారిని అక్రమంగా గృహనిర్బంధం చేయడం ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు. నాడు 'నేను చూశాను... నేను విన్నాను' అన్న జగన్.. నేడు నిరుద్యోగులు తమ గోడు చెప్పుకోవడానికి వస్తుంటే వారిని ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి గృహనిర్బంధం చేయడం ఏంటని ప్రశ్నించారు.
ఉద్యోగాలు ఇవ్వకపోతే.. నిరుద్యోగ భృతి చెల్లించండి: కళా వెంకట్రావు - srikakulam district updates
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వటం చేతకాకపోతే తెదేపా అమలు చేసిన నిరుద్యోగ భృతి చెల్లించాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావ్ డిమాండ్ చేశారు. నాడు 'నేను చూశాను.. నేను విన్నాను' అన్న జగన్.. నేడు నిరుద్యోగులు తమ గోడు చెప్పుకోవడానికి వస్తుంటే గృహనిర్బంధం చేయడం ఏంటని ప్రశ్నించారు.
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అప్పాపురం గ్రామంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి రాకముందు కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర అభివృద్ధిని వెనక్కి నెట్టి తమ కేసులు మాఫీ చేసుకోవడానికి కేంద్ర పెద్దల చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగులకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి చెల్లించామన్నారు. ఇప్పుడు తప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రకటించి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అన్యాయం చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం.. నిరుద్యోగులు అందరికీ రూ.5వేలు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల గోడును పట్టించుకోని సీఎం.. రాష్ట్రానికి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు కిమిడి నాగార్జున, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముప్పిడి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి