తెదేపా నేత కూన రవికుమార్ ఇంట్లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేయడాన్ని ఆ పార్టీ నేత కళా వెంకట్రావు తప్పుబట్టారు. రవికుమార్ భార్య ప్రమీలను పరామర్శించి మాట్లాడారు. వైకాపా పాలనలో హింస జరుగుతోందని ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిని అణిచివేస్తోందని ఆరోపించారు. రవికుమార్‌కు తెదేపా అండగా ఉంటుందన్నారు.
'వైఫల్యాలను ప్రశ్నించేవారిని ప్రభుత్వం అణిచివేస్తోంది' - తెదేపా నేత కూన రవికుమార్ తాాజా సమాచారం
తెదేపా నేత కూన రవికుమార్ భార్య ప్రమీలను తెదేపా నేత కళా వెంకట్రావు పరామర్శించారు. వైకాపా పాలనలో హింస పెట్రేగిపోతోందని ఆయన విమర్శించారు.
కూన రవికుమార్ భార్యను పరామర్శించిన తేదేపా నేత కళా వెంకట్రావు