తెదేపా నేత కళా వెంకట్రావు అరెస్టు, విడుదల - రామతీర్థం తాజా వార్తలు
21:08 January 20
ఎన్ని కేసులు పెట్టినా దేవుని కోసం తెదేపా పోరాటం ఆగదని కళా వెంకట్రావు స్పష్టం చేశారు. ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామన్నారు. దేవాలయాలపై దాడులను ఖండిస్తే అరెస్టులా..? అని ప్రశ్నించారు. రామతీర్థం ఘటనపై ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు.
రామతీర్థం ఘటన నేపథ్యంలో రాజాంలోని ఇంటి నుంచి అదుపులోకి తీసుకున్న తెదేపా నేత, మాజీమంత్రి కళా వెంకట్రావును చీపురుపల్లి పోలీసులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ నెల 2న తెదేపా అధినేత చంద్రబాబు రామతీర్థం పర్యటనలో భాగంగా తెదేపా, వైకాపా నేతల పర్యటనలో ఘర్షణ జరిగింది. 15మంది తెదేపా నేతలపై వైకాపా నేతలు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:చంద్రబాబుపై పోలీసులకు ఎంపీ విజయసాయి ఫిర్యాదు