ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన - నేడు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన

Chandrababu Tour: ధరల పెరుగుదలను నిరసిస్తూ తెదేపా చేపట్టిన 'బాదుడే బాదుడు' నిరసన కార్యక్రమాల్లో స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. అందులో భాగంగా నేడు శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు.

tdp leader Chandrababu tour
tdp leader Chandrababu tour

By

Published : May 4, 2022, 4:31 AM IST

రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజల నడ్డివిరిచేలా ధరాభారం ఉందంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. 'బాదుడే బాదుడు' నిరసన కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొనేందుకు నేటి నుంచి జిల్లా పర్యటనలు చేపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం దల్లవలస గ్రామంలో చంద్రబాబు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. పార్టీ కేడర్‌ను ఇప్పటి నుంచే ఎన్నికలకు సంసిద్ధం చేసేందుకు, వివిధ ఛార్జీల పెంపు, పన్నుల భారాలతో ప్రజలు పడుతున్న అవస్థలపై పోరాడేందుకు తెదేపా అధినేత చంద్రబాబు విస్తృతంగా జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి విశాఖ చేరుకోనున్న చంద్రబాబు... అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పొందూరు మండలం దల్లవలస గ్రామం చేరుకుని బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు.

ABOUT THE AUTHOR

...view details