సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూల్చివేస్తే ఎదురుదాడి చేస్తామని తెదేపా నేత కూన రవికుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే బెందాళం అశోక్, గౌతు శిరీషలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం కూల్చితే ఊరుకోం: తెదేపా
సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూల్చివేస్తామన్న మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలపై తెదేపా మండిపడింది. విగ్రహాన్ని కూల్చివేస్తే ఎదురుదాడి చేస్తామని తెదేపా నేత కూన రవికుమార్ తెలిపారు.
సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం కూల్చితే ఊరుకోం
ప్రభుత్వ భూముల్లో ఉన్న స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం కూల్చివేస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రకటించడం దారుణమన్నారు. మంత్రి అవగాహన లేకుండా మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. తిత్లీ తుపాను బాధితులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఆయన గుర్తుచేశారు.
ఇదీ చదవండి: ఇళ్ల స్థలాల పరిహారం స్వాహా.. ఇద్దరు అధికారులపై వేటు