శ్రీకాకుళం జిల్లా పలాసలో వైకాపా నేతల్ని ప్రజలు తరమడం ఖాయమని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మంత్రి అప్పలరాజు అరాచకాలకు పలాస మున్సిపల్ ఎన్నికలు చెంపపెట్టు కానున్నాయని పేర్కొన్నారు. వైకాపా దురాగతాలను సాగనివ్వమని స్పష్టం చేశారు.
తెదేపా కౌన్సిలర్ అభ్యర్థులను బెదిరించి వైకాపాలో చేర్చుకున్నా.. ఓటమి తప్పదని హితవుపలికారు. అధికారబలంతో ఎన్నికల్లో గెలవడం అసాధ్యమన్నారు. అభివృద్ధే ఎజెండాగా తెదేపా ఎన్నికలకు వెళ్తోందన్న అచ్చెన్న.. వైకాపా మాత్రం అరాచకాలు, అక్రమాలతో గెలుపుకోసం రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు.