ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఏడాది పాలనలో.. రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కు..' - వైకాపా ఏడాది పాలనపై అచ్చెన్నాయుడు

వైకాపా ఏడాది పాలనలో రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయని తెదేపా నేత అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో వెనక్కు వెళ్లి పోతున్నాయని ఆరోపించారు.

acche naidu fires on ysrcp rule
వైకాపా ఏడాది పాలనపై అచ్చెన్నాయుడు

By

Published : May 28, 2020, 4:45 PM IST

వైకాపా సర్కారు ఏడాది పాలనలో.. రాష్ట్రం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని తెదేపా నేత కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏ రంగాన్ని తీసుకున్నా సరే.. మాటలు తప్ప చేతలు లేవని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయని అచ్చెన్నాయుడు అన్నారు. పోలీసుల సహాయం లేకుండా ప్రజలు దగ్గరకు వెళ్లే సత్తా వైకాపా నాయకులకు లేదని ఆరోపించరు.

వైకాపా కార్యకర్తలకే ఇళ్లు కేటాయిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇది అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా కార్యకర్తలపై వేధింపులకు పాల్పడితే సహించేది లేదని స్పష్టం చేశారు. తెదేపా కార్యకర్తలపై పోలీసుల చర్యలు బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు చెప్పారని అధికారులు కేసులు పెడితే ఊరుకునేది లేదన్నారు.

ఇదీ చదవండి: రంగుల అంశంపై హైకోర్టుకు సీఎస్​, పంచాయతీ ముఖ్య కార్యదర్శి

ABOUT THE AUTHOR

...view details