తెదేపా నేత అచ్చెన్నాయుడి అరెస్టును ఆ పార్టీ నేత కూన రవికుమార్ తీవ్రంగా ఖండించారు. ఎలాంటి నోటీసులు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. బీసీ వర్గాలను అణగదొక్కాలని అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని ఆరోపించారు. అచ్చెన్నాయుడిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు పెట్టిన కేసులు అప్రజాస్వామికం అన్నారు. తెదేపా సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న నాయకులను టార్గెట్ చేస్తున్నారని కూన రవికుమార్ మండిపడ్డారు.
'తెదేపా సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న నేతలను టార్గెట్ చేశారు' - మాజీ మంత్రి కూన రవికుమార్ తాజా వార్తలు
తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడి అరెస్ట్‌ను ఆ పార్టీ నేతలు ఖండించారు. బీసీ వర్గాలను అణగదొక్కాలని జగన్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆపార్టీ నేత కూన రవికుమార్ ఆరోపించారు.
tdp kuna ravikumar