ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రచారం - palasa tdp election campaign

శ్రీకాకుళం జిల్లాలో పురఎన్నికల ప్రచారంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు... అభ్యర్థులతో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైకాపా అభ్యర్థులు ఓటర్లను భయపెట్టే విధంగా ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.

tdp  election campaign in srikakulam district
శ్రీకాకుళం జిల్లాలో ఎంపీ రామ్మోహన్ నాయుడు ఇంటింటి ప్రచారం

By

Published : Mar 4, 2021, 4:17 PM IST

వైకాపా పాలన సామాన్యుడి వెన్ను విరిగే విధంగా ఉందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా పలాస, కాశీబుగ్గ పుర ఎన్నికల్లో తెదేపా ప్రచారం జోరందుకుంది. ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ఇంటింటి ప్రచారం చేస్తూ.. అభ్యర్థుల్లో ఉత్సాహం నింపారు. వైకాపా అభ్యర్థులు ఓటర్లను భయపెట్టే విధంగా ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ పథకాలను తీసివేస్తే.. జగన్ ఇంటి ముందు ధర్నా చేసి మరీ పథకాలను ఇప్పిస్తామని ప్రజలకు ఎంపీ భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details