తెదేపా రాష్ట్ర అధ్యక్షునిగా కింజరాపు అచ్చెన్నాయుడు నియామకంతో శ్రీకాకుళం జిల్లాలోని తెదేపా కార్యకర్తలు సంబరాలు జరిపారు. బాణసంచా కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెదేపా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి కేక్ కట్ చేశారు. ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడుని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. జిల్లా నేతలకు పార్టీలో అత్యంత ప్రాధాన్యం ఇచ్చినందుకు తెదేపా శ్రేణులు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో తెదేపా శ్రేణుల సంబరాలు - శ్రీకాకుళం తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లాలో తెదేపా శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. అచ్చెన్నాయుడిని తెదేపా రాష్ట్ర అధ్యక్షునికి ప్రకటించడం పట్ల స్థానిక నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో తెదేపా శ్రేణుల సంబరాలు