TDP Atchannaidu Reaction On Jagananna Vidya Deevena: విద్యాదీవెన కాదు.. విద్యార్ధులకు దగా దీవెన అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. తెలుగుదేశం హయాంలో 16 లక్షల మంది విద్యార్ధులకు అందిస్తే.. జగన్ ప్రభుత్వం 11 లక్షల మందికి అందించి.. 5 లక్షల మంది విద్యార్ధులకు విద్యా దీవెన కోత పెట్టారని మండిపడ్డారు. మోసకారి సంక్షేమం పేరుతో గోరంత ఇచ్చి కొండంత ప్రచారం చేసుకుంటున్నారని ఆక్షేపించారు. 2021-22లో 4వ క్వార్టర్ నగదు విడుదల చేయకపోవడంతో యాజమాన్యం విద్యార్ధులను పరీక్షలు రాయనీవ్వడం లేదన్నారు. పీజీ విద్యార్థులకు విద్యాదీవెన నిలిపివేసి బడుగు బలహీన వర్గాలకు ఉన్నత చదువులకు దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యాదీవెన కాదు.. విద్యార్ధులకు దగా దీవెన: అచ్చెన్నాయుడు - Jagananna Vidya Deevena
Jagananna Vidya Deevena: మూడున్నరేళ్లలో విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించి విద్యార్దుల భవిష్యత్‌ను నాశనం చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. విద్యాదీవెన కాదు.. విద్యార్ధులకు దగా దీవెన అని ఆయన ధ్వజమెత్తారు. సంక్షేమం పేరుతో గోరంత ఇచ్చి కొండంత ప్రచారం చేసుకుంటున్నారని ఆక్షేపించారు.
Jagananna Vidya Deevena
మూడున్నరేళ్లలో విద్యా రంగాన్ని భ్రష్టుపట్టించి విద్యార్దుల భవిష్యత్‌ను నాశనం చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తెలుగుదేశం అమలు చేసిన విదేశీ విద్య, పీజీ విద్యార్ధులకు ఫీజు రీయంబర్స్మెంట్, ఎన్టీఆర్ విద్యోన్నతి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వంటి పధకాలు రద్దు చేసి విద్యార్ధులకు ద్రోహం చేశారని మండిపడ్డారు.
ఇవీ చదవండి:
TAGGED:
అచ్చెన్నాయుడు