ఆమదాలవలస మండలంలోని కలివరం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన.. తొగరం గ్రామ సర్పంచ్ వాణి శ్రీ అధికారులపై మండిపడ్డారు. భోజనం అధ్వానంగా ఉందని.. గతంలో స్పీకర్ దృష్టికి తీసుకెళ్లినా మార్పు రాలేదన్నారు. మీరు ఫైవ్ స్టార్ హోటల్లో తింటారని.. ఈ భోజనం తింటే ఎలా ఉందో తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భోజనం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటే.. ఇలాంటి భోజనం అందిస్తారా? అని అధికారులను ప్రశ్నించారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.
మెున్ననే వార్నింగ్ ఇచ్చా.. ఇక యాక్షన్‌లోకి దిగుతా: తమ్మినేని వాణి శ్రీ - ఆమదాలవలస పాఠశాలలో తమ్మనేని వాణి శ్రీ పరిశీలన న్యూస్
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని కలివరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని శాసన సభాపతి తమ్మినేని సీతారాం సతీమణి వాణిశ్రీ పరిశీలించారు. ఇటీవలే ఆమె తొగరం గ్రామ సర్పంచ్‌గా గెలిచారు. అయితే కలివరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో భోజనం సరిగా లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
tammineni sitharam wife fires on officers over mid day meals scheeme
Last Updated : Mar 6, 2021, 10:43 PM IST