తెలుగుదేశం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టు.. అన్ని ఆధారాలతో... చట్ట ప్రకారమే జరిగిందని శాసన సభాపతి తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. తప్పు చేస్తే ఎవరినైనా అరెస్టు చేస్తామని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడు తప్పు చేయకపోతే ఎవరు చేశారో వారే చెప్పాలన్నారు. ఈ విషయంపై తెదేపా అధినేత చంద్రబాబు మాట్లాడే విధానం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
నన్ను సంప్రదించారు... చట్ట ప్రకారమే అరెస్టు: సభాపతి తమ్మినేని - అచ్చెన్నాయుడు అరెస్టు వార్తలు
మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టుపై శాసనసభాపతి తమ్మినేని సీతారాం స్పందించారు. చట్ట ప్రకారమే అరెస్టు జరిగిందని చెప్పారు. తెదేపా నేతల ఆరోపణలపై స్పందించిన ఆయన... అచ్చెన్నాయుడు తప్పు చేయకపోతే ఎవరు చేశారో వారే చెప్పాలని అన్నారు.
![నన్ను సంప్రదించారు... చట్ట ప్రకారమే అరెస్టు: సభాపతి తమ్మినేని tammineni seetharam respond on atchannaidu arrest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7602676-457-7602676-1592049643499.jpg)
tammineni seetharam respond on atchannaidu arrest
మీడియాతో సభాపతి తమ్మినేని సీతారాం
అచ్చెన్న అరెస్టుపై అనిశా అధికారులు నాకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు వివరాలు, సభ్యుడి వివరాలు పంపించారు. జైళ్ల విభాగం, అనిశా కోర్టు నుంచి కూడా నాకు సమాచారం పంపారు. అచ్చెన్న అరెస్టు ప్రక్రియలో ఎక్కడా విధానపరమైన లోపం లేదు- తమ్మినేని సీతారాం, సభాపతి