ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఎం జగన్ ఆశయాలు నెరవేర్చాలి' - ఆమదాలవలసలో తమ్మినేని సీతారాం పర్యటన

సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో పొందూరు మండలం ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ ఆశయాలను నెరవేర్చాలని అధికారులకు సూచించారు.

Tammineni seetha ram on government schemes
Tammineni seetha ram on government schemes

By

Published : May 21, 2020, 4:35 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో శాసన సభాపతి తమ్మినేని సీతారాం పొందూరు మండలం ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, సచివాలయాలు నిర్మాణాలు చేపట్టేందుకు స్థలాలు సేకరించాలని సూచించారు. ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు అందించాలన్న ఉద్దేశంతో సీఎం జగన్ ఉన్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details