శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని గంగంపేట, చిన్న లంకం మధ్య ఉన్న వంశధార, నాగావళి హై లెవెల్ ఛానల్ను సభాపతి తమ్మినేని సీతారాం పరిశీలించారు. రైతులను అడిగి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. వరదలు వస్తే ఈ ప్రాంతంలో పంటలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయని రైతులు స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే వయాడక్ట్ నిర్మాణం చేపట్టాలని లేదా పంటలు ముంపునకు గురికాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ అంశంపై అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించి నివేదిక అందించాలన్నారు. ముంపు సమస్యకు త్వరలో పరిష్కారం చూపుతామని సభాపతి రైతులకు హామీ ఇచ్చారు.
ముంపు సమస్యకు త్వరలో పరిష్కారం: సభాపతి తమ్మినేని - శ్రీకాకుళంలో స్పీకర్ పర్యటన
సభాపతి తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి హై లెవెల్ ఛానల్ను పరిశీలించారు. రైతుల సమస్యలు తెలుసుకొని తక్షణమే పరిష్కార మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.
ముంపు సమస్యకు తర్వలో పరిష్కారం చూపుతాం