రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది: సభాపతి తమ్మినేని - రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
తమది రైతు పక్షపాత ప్రభుత్వమని శాసనసభాపతి తమ్మినేని సీతారం వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ రైతుల సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని శాసన సభాపతి తమ్మినేని సీతారం వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం అగ్రహారం గ్రామంలోని రైతుభరోసా కేంద్రం వద్ద రైతులకు ఎరువులు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి జగన్ రైతలు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని సభాపతి వ్యాఖ్యానించారు. రైతులు ఎరువులు, విత్తనాల కోసం ఇబ్బందులు ఎదుర్కోకుండా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వంగా సీతారం చెప్పుకొచ్చారు.