తెదేపా నేత కూన రవికుమార్‌పై కేసులకు తనకు ఎలాంటి సంబంధం లేదని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. ఆయన కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై సభాపతి స్పందించారు. శ్రీకాకుళంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన... అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులను బెదిరించినందుకే రవికుమార్‌పై కేసులు నమోదయ్యాయని అన్నారు. తనపై, తన కుటుంబంపైనా లేనిపోని ఆరోపణలు చేయటం మానుకోవాలని హెచ్చరించారు. జిల్లాలో అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌తో పాటు మరి కొంతమంది తెదేపా నాయకులకు ఉన్న క్రిమినల్ ట్రాక్ ఇంకెవరికీ లేదని ఆరోపించారు. జిల్లాలోని నాయకులపై క్రిమినల్ టాక్ బయటకు తీస్తే ఎవరు ఎలాంటి వారో అర్థమవుతుంది అన్నారు. మూడు నెలలు అధికారం లేకపోతే ఇలా చిందులేయడం తగదని ఆయన విమర్శించారు.
"తెదేపా నేతల ఆరోపణలపై మీరేమంటారు" అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటికి తనకు ఏంటి సంబంధం అని ప్రశ్నించారు... చెప్పకపోతే ఇక్కడ నుంచి కదలనీయనని అన్నారు. అనంతరం వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. బాధ్యతగా వ్యవహరించండి అని వారికి సూచించారు.
ఇవీ చదవండి