శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురంలోని ఇసుక ర్యాంపు నుంచి రాత్రివేళల్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కులు ఇసుకను సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.
'ఇసుక అక్రమరవాణా పై చర్యలు తీసుకోండి' - శ్రీకాకుళంలో ఇసుక అక్రమ రవాణా
రాత్రి వేళల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా పురుషోత్తపురం గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.

ఇసుక అక్రమరవాణా పై చర్యలు తీసుకోండి