ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆమదాలవలసలో తహసీల్దార్ పర్యటన - ఆమదాలవలస నేటి వార్తలు

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని పలు గ్రామాల్లో స్థానిక తహసీల్దార్ పర్యటించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Tahsildar Srinivasa Rao  toured  in   Amadalavalasa Mandal srikakulam district
ఆమదాలవలస మండలంలో పర్యటించిన తహశీల్దార్ శ్రీనివాసరావు

By

Published : Jun 18, 2020, 5:28 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తహసీల్దార్ శ్రీనివాసరావు సూచించారు. ఆమదాలవలస మండలం అక్కులపేట, చీమలవలస ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. గ్రామాల్లోని పరిస్థితిపై జిల్లా కలెక్టర్​కు నివేదిక అందిస్తున్నామని తెలిపారు. హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నామన్నారు. కంటైన్మెంట్ జోన్​లో ఉన్నవారికి కరోనా నిర్థరణ పరీక్షలు చేపడుతున్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details