ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుళ్ళ సీతారాంపురం ఆలయ దుస్థితిపై.. స్వాత్మానందేంద్ర స్వామి ఆవేదన - today Swatmanandendra Swami in srikakulam district news update

హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా గుళ్ళ సీతారాంపురం లోని ఆలయాన్ని.. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి దర్శించారు. ఆలయ దుస్థితిపై విచారం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిపై దేవాదాయ శాఖతో చర్చిస్తామని తెలిపారు.

Swatmanandendra Swami
గుళ్ళ సీతారాంపురం ఆలయం సందర్శించిన స్వాత్మానందేంద్ర స్వామి

By

Published : Mar 23, 2021, 7:21 PM IST

గుళ్ళ సీతారాంపురం ఆలయం సందర్శించిన స్వాత్మానందేంద్ర స్వామి

శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గుళ్ళ సీతారాంపురం ఆలయ దుస్థితి చూసి.. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి భావోద్వేగానికి గురయ్యారు. హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా గుళ్ళ సీతారాంపురం లోని ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి మూడు వేల ఎకరాలు భూములున్నా.. నిర్లక్ష్యానికి గురి కావడం బాధాకరమన్నారు.

ఆలయ భూముల్ని అన్యాక్రాంతం చేసిన వారే.. దోచుకున్న భూముల్ని స్వచ్ఛందంగా ఆలయానికి అప్పగించాలని కోరారు. అలాగే శ్రీరామనవమి వేడుకలకు విశాఖ శారదాపీఠం తరఫున పట్టువస్త్రాలను పంపుతామని అలయ అర్చకులకు స్వాత్మానందేంద్ర చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details