శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలోని మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రాజేశ్‌ను శుక్రవారం సస్పెండ్ చేశారు. సోంపేట మేజర్ గ్రామ పంచాయతీలో కరోనా లక్షణాలతో మృతి చెందిన వ్యక్తిని ట్రాక్టర్‌లో తరలించినందుకు కలెక్టర్ నివాస్ చర్యలు తీసుకున్నారు. పంచాయతీ ఈవో జ్యోతిశ్వరరెడ్డితో పాటు ట్రాక్టర్ డ్రైవర్, మరో ఇద్దరు పారిశుద్ధ్య సిబ్బందిని కలెక్టర్ నివాస్ సస్పెండ్ చేశారు.
వారి అంత్యక్రియల్లో అమానవీయంగా వ్యవహరించిన అధికారులపై వేటు - covid dead bodies
శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ అనుమానిత లక్షణాలతో మృతి చెందిన వ్యక్తుల అంత్యక్రియల విషయంలో.. అమానవీయంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకున్నట్టు జిల్లా కలెక్టర్ నివాస్ తెలిపారు.
కరోనా మృతుల అంత్యక్రియలలో అమానవీయంగా వ్యవహరించిన అధికారులపై వేటు
సోంపేట తహసీల్దార్, ఎంపీడీవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా జిల్లాలో మూడు నెలలుగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని కలెక్టర్ నివాస్ పేర్కొన్నారు.
ఇది చదవండి నగ్న దృశ్యాలతో మూడేళ్లుగా యువతికి వేధింపులు