శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, సీదిరి అప్పలరాజు దర్శించుకున్నారు. వేద పఠనాలతో అర్చకులు... మంత్రులను ఆహ్వానం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ వారికి ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ ఈవో సూర్యప్రకాష్ మంత్రులకు స్వామివారి చిత్రపటాలను అందించారు.