ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆదిత్యుని దర్శనం ప్రారంభం - అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం

అరసవెల్లి సూర్యనారాయణస్వామి దర్శనాలు శనివారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఉదయం 7.30 గంటల నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ఇందుకు సంబంధించి దేవాదాయ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆలయంలో శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. క్యూలైన్లు, థర్మల్‌ స్క్రీనింగ్‌ పరికరాలను సిద్ధం చేశారు.

surya temple
surya temple

By

Published : Oct 17, 2020, 3:10 PM IST

శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో దర్శనాలు ప్రారంభం అయ్యాయి. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ.. ఈరోజు నుంచి భక్తులకు దర్శనాలకు అనుమతులను ఇచ్చారు. లడ్డూ ప్రసాదం అందుబాటులో ఉంచారు.

ఆలయానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఈవో సూర్యప్రకాశ్‌ తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ క్యూ లైనులో గీసిన వృత్తంలో ఉండి స్వామిని దర్శించుకోవాలని కోరారు. వెంట గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details