శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి మూలవిరాట్‌ను లేలేత కిరణాలు తాకాయి. సూర్యకిరణాలు పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి ఆదిత్యుని తాకే దృశ్యాలను చూసి భక్తులు పులకరించారు. 9 నిమిషాల పాటు ఈ అద్భుత దృశ్యాన్ని చూసే భాగ్యం భక్తులకు కలిగింది. ఉత్తరాయనం, దక్షిణాయనం మార్పుల్లో ఈ కిరణస్పర్శ భాస్కరుని తాకుతుంది. స్వామివారి పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్లే ఈ అద్భుత ఘట్టం ఏటా మార్చి 9,10 తేదీల్లో... అలాగే అక్టోబర్ నెల 1,2 తేదీల్లో భక్తులకు కనువిందు చేస్తుంది.
అరసవల్లిలో ఆదిత్యుని పాదాలు తాకిన కిరణాలు
అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. లేలేత సూర్య కిరణాలు ఆదిత్యుని మూల విరాట్‌ను తాకాయి. భక్తులు భారీ ఎత్తున హాజరై ఈ దృశ్యాలను తిలకించారు.
sun's rays touched the statue of Suryanarayana Swamy in arasavalli temple