కొవిడ్ నివారణ చర్యల్లో భాగంగా.. శ్రీకాకుళంలో సంపూర్ణ లాక్డౌన్ నిర్వహించారు. నగరంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వారం నుంచి ప్రతి ఆదివారం లాక్‌డౌన్‌గా కలెక్టర్ నివాస్ ప్రకటించారు. ఆదివారం రోజున ప్రజలు పెద్ద ఎత్తున మార్కెట్లు, ఇతర ప్రదేశాల్లో తిరుగుతున్నారు. అధిక రద్దీకి కారణమవుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం లాక్డౌన్ చర్యలకు ఉపక్రమించింది. అయితే ప్రజల్లో అప్రమత్తత పూర్తిస్ధాయిలో లేకపోవటంతో కేసుల సంఖ్య జూన్ నుంచి ఇప్పటివరకు బాగా పెరుగుతున్నాయన్నారు. కేవలం మందుల దుకాణాలకే అనుమతించిన కలెక్టర్ పాలు, బ్రెడ్‌కు మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెరిచారు. అత్యవసర వైద్యం కోసం ఏ సమయంలోనైనా అనుమతిస్తున్నట్లు కలెక్టర్ నివాస్ ప్రకటించారు.
జిల్లాలో పక్కాగా అమలవుతోన్న ఆదివారం లాక్డౌన్ - lockdown news in srikakulam dst
శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం లాక్డౌన్ పటిష్టంగా అమలవుతోంది. మార్కెట్లలో ప్రజల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి ఆదివారం లాక్డౌన్ పాటించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అత్యవసరాలు మినహా అన్నీ దుకాణాలు మూసే ఉన్నాయి.

Sunday lockdown in srikakulam dst are implementing strictly