ఆంధ్రప్రదేశ్

andhra pradesh

arasavalli: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని తాకిన రవి కిరణాలు

By

Published : Oct 1, 2021, 7:11 AM IST

Updated : Oct 1, 2021, 1:12 PM IST

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి(arasavalli)లోని శ్రీ సూర్యనారాయణ స్వామిని సూర్య కిరణాలు తాకాయి. ఉత్తరాయణం, దక్షిణాయణం మార్పుల్లో స్వామిని సూర్య కిరణాలు తాకుతుంటాయి.

Sunbeams touching Arasavalli Suryanarayana Swami
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని తాకిన రవి కిరణాలు

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని తాకిన రవి కిరణాలు

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని భానుడి లేలేత కిరణాలు ఈ ఉదయం తాకాయి. ఉదయం తొమ్మిది నిమిషాల పాటు సూర్య కిరణాలు మూలవిరాట్టును స్పృశించినట్లు ప్రధానార్చకులు తెలిపారు.. ఉత్తరాయణం, దక్షిణాయణం మార్పుల్లో స్వామిని ఆదిత్యుని కిరణాలు తాకటం ఆనవాయితీ. ప్రతీయేటా మార్చి 9, 10 తేదీల్లో... తిరిగి అక్టోబర్ 1, 2 తేదీల్లో .... రవి కిరణాలు స్వామి వారిని స్పృశిస్తాయి. ఆ అద్భుత ఘట్టం ఇవాళ ఆవిష్కృతం అయింది. ఈ అపురూప దృశ్యం చూసి భక్తులు పులకించిపోయారు.

Last Updated : Oct 1, 2021, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details