శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఎండలు మండిపోతున్నాయి. పట్టణంలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ప్రజలు నిత్యకృత్యాలకు బయటకు రావడానికి భయపడిపోతున్నారు. వృద్ధులు, గర్భిణీలు విలవిల్లాడిపోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే రహదారులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ప్రజలు సాయంత్రం 5 గంటల తర్వాతే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు.
ఆముదాలవలసలో.. భానుడి భగభగలు
భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. రోజురోజుకీ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రంలో కొన్నిచోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు.
ఆముదాలవలసలో భానుడి భగభగలు